News December 8, 2025
ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
Similar News
News April 13, 2026
కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News April 13, 2026
‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి మేము వ్యతిరేకం: CM

TG: NDA ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ సౌత్ స్టేట్స్‌కు ఇవ్వడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేయొద్దన్నారు.
News April 13, 2026
పాక్ పరువు కాపాడిన సౌదీ-ఖతర్!

అప్పుల్లో కూరుకుపోయిన పాక్‌ను చివరి నిమిషంలో సౌదీ, ఖతర్‌లు ఆదుకున్నాయి. UAEకి చెల్లించాల్సిన ₹32,673 కోట్ల బకాయిల గడువు సమీపించడం, కట్టకపోతే పరువు పోతుందనే భయం.. మరోవైపు IMF కొరడా! ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి ఔరంగజేబు US పర్యటనకు వెళ్లగా.. ఈ 2 దేశాలు ₹46,665 కోట్ల సాయం ప్రకటించాయి. అప్పుల గండం నుంచి గట్టెక్కించేందుకు కొత్తగా ఖతర్ రంగ ప్రవేశం చేయడం పాక్‌కు కలిసొచ్చింది.


