News December 8, 2025
పెద్దపల్లి: బిర్యానీ రూ.150.. టీ రూ.5..!

పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ సూచించిన పరిధిలో ఖర్చు చేయాలి. ఇందుకోసం కమిషన్ ఒక్క బిర్యాని ఖరీదు రూ.150, టీ రూ.5, ఇతర వస్తువుల ధరలు సైతం నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు 5వేలలోపు ఓటర్లుగల గ్రామాలలో రూ.1,50,000, వార్డ్ సభ్యులు రూ.30,000లోపు.. అలాగే 5వేల జనాభా మించితే సర్పంచ్ రూ.2,50,000, సభ్యుడు రూ.50,000లోపు ఖర్చు చేయాలి. ఇవి మించితే అనర్హులే.
Similar News
News January 12, 2026
మెస్సీ ఓ మాట చెప్పాడంతే.. ₹లక్ష కోట్లు పెరిగిన సంపద!

సెలబ్రిటీలు చేసే చిన్న పనులు కూడా కొన్ని కంపెనీలపై భారీ ప్రభావం చూపిస్తాయి. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ క్యాజువల్‌గా చెప్పిన మాట కోకా-కోలాకు సిరులు కురిపించింది. ‘నాకు వైన్ అంటే ఇష్టం. స్ర్పైట్ కలుపుకుని తాగుతా’ అని ఆయన చెప్పారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. 3రోజుల్లో 12.9బిలియన్ డాలర్ల(₹1.16లక్షల కోట్లు) సంపద పెరిగింది. 2021లో రొనాల్డో కోకా-కోలా ప్రొడక్టును పక్కనపెట్టడంతో $4Bను కోల్పోయింది.
News January 12, 2026
జగిత్యాల: 19 నుంచి సర్పంచులకు శిక్షణ తరగతులు

జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన 385 మంది సర్పంచులకు ఈనెల 19 నుంచి విడతలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 3 మండలాలను ఒక బ్యాచ్‌గా విభజించి, పంచాయతీరాజ్ విధులు, గ్రామాభివృద్ధిపై అవగాహన కల్పించనున్నారు. కేటాయించిన తేదీల్లో సర్పంచులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 12, 2026
అర్జీలను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


