News December 8, 2025

సంగారెడ్డి: అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ టీచర్ భార్య మృతి

image

కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్న సుచిత ఆదివారం అనుమానస్పదంగా మృతి చెందింది. ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. మాధ్వార్‌లో అంత్యక్రియల సమయంలో గొంతు వద్ద మరకలు చూసి సుచిత బంధువులు అంత్యక్రియలు నిలిపివేశారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Similar News

News January 12, 2026

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు 11నెలల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.10వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రయాణికుల చెక్-ఇన్, బ్యాగేజ్, టికెటింగ్, బోర్డింగ్ సేవల్లో శిక్షణ ఇస్తారు. ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వివరాలకు <>AIASL<<>> వెబ్‌సైట్ చెక్ చేయండి.

News January 12, 2026

పల్నాడు: జంగా రాజీనామా నిర్ణయంపై ఉత్కంఠ.!

image

టీటీడీ బోర్డు మెంబర్ పదవికి జంగా కృష్ణమూర్తి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా టీ కప్పులో తుఫాన్ లా సమసి పోతుందా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంఓ నుంచి జంగాకు పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీఎం బిజీగా ఉండటం వలన జంగా ఆయనను కలవలేకపోయారని సమాచారం. రాజీనామా నిర్ణయంపై జరగబోతున్న పరిణామాలు, ఆయన భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.

News January 12, 2026

మేడారం: ఆర్టీసీ బస్సులు, వీఐపీలకు తాడ్వాయి రూట్..!

image

మేడారం వచ్చే RTC బస్సులు, వీఐపీల వాహనాలకు అధికారులు తాడ్వాయి రూట్‌ను కేటాయించారు. పస్రా వద్ద తనిఖీ అనంతరం తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో ఇదే రూట్‌ను అనుసరించాలి. బస్సులు, వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి వచ్చే వాహనాల కోసం ఈసారి లవ్వాల-బందాల-పస్రా దారిని అందుబాటులోకి తెచ్చారు.