News December 8, 2025

వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

image

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.

Similar News

News January 10, 2026

10 పరుగుల తేడాతో ఓటమి

image

WPL-2026లో గుజరాత్ జెయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 207 రన్స్ చేయగా ఛేదనలో యూపీ 197-8 స్కోరుకు పరిమితమైంది. చివరి 3 బంతుల్లో 6, 4, 4 బాదినా ప్రయోజనం లేకపోయింది. లిచ్‌ఫీల్డ్(78) అర్ధసెంచరీ చేయగా మెగ్ లానింగ్(30), శ్వేత(25) రన్స్ చేశారు. GG బౌలర్లలో రేణుకా, జార్జియా, సోఫీ తలో 2 వికెట్లు తీశారు. గార్డ్‌నర్, రాజేశ్వరీ చెరో వికెట్ తీశారు.

News January 10, 2026

రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

image

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ ₹3వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.

News January 10, 2026

అసభ్య ఫొటోల ఎఫెక్ట్.. ‘గ్రోక్‌’పై ఇండోనేషియా వేటు!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ చాట్‌బాట్‌లో <<18752905>>అసభ్య ఫొటోలు<<>>, ఇతర అశ్లీల కంటెంట్ పెరిగిపోవడంతో ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రోక్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఆ Ai టూల్‌పై చర్యలు తీసుకున్న తొలి దేశంగా నిలిచింది. డిజిటల్ స్పేస్‌లో వస్తున్న అసభ్య కంటెంట్‌ను మానవహక్కులు, పౌరుల భద్రతా ఉల్లంఘనగా తమ ప్రభుత్వం చూస్తోందని మంత్రి మోత్యా హఫీద్ చెప్పారు. Xకు నోటీసులు పంపినట్లు తెలిపారు.