News April 19, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

ఢిల్లీ CM కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రోజూ 15min పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతివ్వాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్‌ను అందించాలని జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఈనెల 22న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. జైలు అధికారులు, ఈడీ దీనిపై రేపటిలోగా స్పందించాలని ఆదేశించింది.

Similar News

News October 14, 2024

స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్

image

బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.

News October 14, 2024

ఇండియా-A కెప్టెన్‌గా తిలక్‌వర్మ

image

అక్టోబర్‌లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఇండియా-A జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మ కెప్టెన్సీ చేయనున్నారు. అతడికి డిప్యూటీగా అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ ఒమన్ వేదికగా అక్టోబర్ 18-27 మధ్య జరగనుంది. గ్రూప్‌-Aలో బంగ్లాదేశ్-A, శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A, హాంకాంగ్ ఉండగా గ్రూప్-Bలో ఇండియా-A, పాకిస్థాన్-A, UAE, ఒమన్ ఉన్నాయి.

News October 14, 2024

DANGER: అలాంటి టీ తాగుతున్నారా?

image

చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొందరు ఒకేసారి ఎక్కువగా టీ పెట్టుకొని మరలా కాచుకొని తాగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ కాచుకున్న 15-20 నిమిషాల్లోపు తాగడం మంచిదని చెప్పారు. దీనిని విస్మరిస్తే జీర్ణశయాంతర వ్యవస్థ, ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుందన్నారు. జపాన్‌లో కాచి పక్కన పెట్టిన టీని పాము విషం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని తెలిపారు.