News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్లో తెలుగు సినిమా దమ్ము

HYD శివారు మీర్‌ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో మన తెలుగు సినిమాల దమ్మెంటో చూపించటం కోసం ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూ టెక్నాలజీ, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు, ఇందులో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక వేదిక కానుంది.
Similar News
News January 12, 2026
పలాసలో భయపెట్టిస్తున్న గన్ కల్చర్

పలాసలో మరోసారి గన్ కల్చర్‌తో అలజడి రేగింది. ఈనెల 9న పలాస రైల్వే టూ వీలర్ పార్కింగ్ స్థల టెండర్ విషయంలో గన్, కత్తులతో కొందరు బెదిరింపులకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 NOVలో ఓ టీడీపీ నేత హత్యకు గన్స్‌తో వచ్చిన సుపారీ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలు 1978-80ల నాటి క్రైమ్‌ను ప్రజలకు గుర్తు తెస్తున్నాయి. అప్పట్లోనూ నాటు తుపాకులు, కత్తులతో దాడులు చేసి ముగ్గురిని హతమార్చారు.
News January 12, 2026
MHBD జిల్లాలో యూరియా కొరత లేదు: ADA

జిల్లా వ్యాప్తంగా 571 యూరియా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సరిత తెలిపారు. PACS ఆధ్వర్యంలో 439, ప్రైవేట్ డీలర్స్, అదనపు సహకార శాఖ కేంద్రాలు 20, రైతు సేవ ఆగ్రోస్, ODCMC, మొదలగు కేంద్రాలు 112 ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 2లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, ఇప్పటికే 2లక్షల 25 వేల టన్నులు సేకరించామన్నారు.
News January 12, 2026
ప్రజావాణిలో 66 దరఖాస్తులు స్వీకరణ: అడిషనల్ కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల వద్ద నుంచి 66 ఫిర్యాదులు స్వీకరించామని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డోర్నకల్, మహబూబాబాద్, గూడూరు, పెద్ద వంగర మండలాల నుంచి ప్రజలు పలు సమస్యలపై దరఖాస్తులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ పురుషోత్తం, మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.


