News December 8, 2025
బొమ్మూరు: స్టార్టప్ ఐడియా ఉందా? రండి.. ‘స్పార్క్’ చూపిద్దాం!

నూతన ఆవిష్కరణలు, వినూత్న వ్యాపార ఆలోచనలు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 9 నుంచి 11 వరకు ‘స్పార్క్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ వై. మేఘ స్వరూప్‌తో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలో నిపుణులు దిశానిర్దేశం చేస్తారన్నారు. నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
Similar News
News March 3, 2026
సీతానగరం మండలంలో యాక్సిడెంట్

సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్(15) నడుపుతున్న బైకు రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 2, 2026
పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.


