News December 8, 2025
సిద్దిపేట: ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవీఎం) గోదాంని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్శనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్‌లను భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్‌లను పరిశీలించారు.
Similar News
News December 8, 2025
ఎరీన స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఏఎన్‌యూ విద్యార్థుల సత్తా

మంగళగిరిలో నిర్మల ఫార్మసీ కళాశాల నిర్వహించిన ఎరీన 2025 స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ANU విద్యార్థులు సత్తా చాటారు. ఖోఖో ఉమెన్‌లో ప్రథమ, 100 మీటర్ల రిలే రన్నింగ్ ప్రథమ, చెస్‌లో ద్వితీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విజేతలను వర్సిటీ వీసీ గంగాధరరావు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News December 8, 2025
సంగారెడ్డి: ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలు చేయాలి: డీఈఓ

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) వంద శాతం అమలు అయ్యే విధంగా మండల విద్యాధికారులు చొరవ తీసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల విద్యాధికారులతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. ఎంఈఓలు ప్రతి రోజు పాఠశాలలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.
News December 8, 2025
నరసరావుపేట పీజీఆర్‌ఎస్‌కు 134 అర్జీలు

నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంతోష్ పాల్గొన్నారు. ఆయన కుటుంబ, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన మొత్తం 134 అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.


