News December 8, 2025
ఏజెంట్ స్పేస్‌లో డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని అన్ని శాఖల వారు ఏజెంట్ స్పేస్‌లో డాక్యుమెంట్ అప్లోడ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇప్పటివరకు సర్వే శాఖ లక్షకు పైగా, కలెక్టరేట్ ద్వారా 55 వేలు మాత్రమే అప్లోడ్ చేశారని ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ దేవాదాయ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ, విద్యాశాఖ, టౌన్ ప్లానింగ్, మైనారిటీ సంక్షేమ శాఖ, తదితర శాఖలు ఒక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయలేదని, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
MBNR: బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది.. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్యపల్లిలో చోటుచేసుకున్న <<19307113>>దంపతుల ఆత్మహత్యాయత్నం<<>> స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి ‘మేము ఇక బతకలేం’ అని రోదించడం అందరినీ కలిచివేసింది.
News March 5, 2026
MBNR: ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

నవాబుపేట(M) జంగమయ్యపల్లిలో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మురుగని రవి-లావణ్య దంపతులు తమ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి HYDలోని తన తమ్ముడికి వీడియో కాల్ చేసి, తాము చనిపోతున్నామని తెలిపారు. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ప్రాణంతో ఉన్న రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


