News December 8, 2025

అన్నమయ్య: ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా?

image

PM మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడే ‘పరీక్షా పే చర్చ–2026’ కార్యక్రమానికి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి శ్రీనివాస్ సూచించారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ 2026 జనవరి 11 వరకు innovateindia1.mygov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Similar News

News January 14, 2026

‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

image

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

News January 14, 2026

‘ట్రంప్ ఎలా బతికున్నారో ఏంటో’.. ఆరోగ్యశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

image

ట్రంప్ జంక్ ఫుడ్ అలవాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మెక్‌డొనాల్డ్స్ ఫుడ్, క్యాండీలు తింటూ డైట్ కోక్ తాగుతారని తెలిపారు. రోజంతా శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ‘ఆయన ఇంకా ఎలా బతికున్నారో అర్థం కావడం లేదు’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ప్రయాణాల్లో కార్పొరేట్ కంపెనీల ఫుడ్‌నే నమ్ముతారని.. ఆయనకు దైవ సమానమైన శరీరతత్వం ఉందని చమత్కరించారు.

News January 14, 2026

పండుగ రోజున స్వీట్స్ ఎందుకు తింటారు?

image

సంక్రాంతి ఆరోగ్యప్రదాయిని. చలికాలంలో వచ్చే వాత సమస్యలను తగ్గించడానికి సకినాల్లో వాడే వాము, శరీరానికి వేడినిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా అందుతాయి. దంపుడు బియ్యంతో చేసే పొంగలి, ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే చెరుకు, పోషకాలున్న గుమ్మడికాయ శరీరానికి బలాన్నిస్తాయి. ఇంటి ముంగిట పేడ నీళ్లు, మామిడాకులు బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.