News December 8, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 5, 2026
విశాఖ విచ్చేసిన మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మధ్యాహ్నం విశాఖ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావడానికి లోకేశ్ వచ్చారు.
News March 5, 2026
ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
News March 5, 2026
విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.


