News April 19, 2024
విశాఖ: మే 11న జాతీయ లోక్ అదాలత్

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 11న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ లోక్ ఆదాలత్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాలు కేసులను పరిష్కరించుకోవచ్చు. పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 22, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 22, 2026
విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.
News March 22, 2026
విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.


