News December 8, 2025

కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

బాలల సంక్షేమం కోసం చర్యలు తప్పవు: కలెక్టర్

image

బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆధార్ లేని అనాధ పిల్లలకు తక్షణమే కార్డులు మంజూరు చేయాలని సూచించారు.

News March 23, 2026

మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ PGRS హాలులో ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలన్నారు.

News March 23, 2026

మొవ్వలో షార్ట్ సర్కూట్.. 3 గృహాలు దగ్ధం

image

మొవ్వ మండలం కాజ శివారు కుళాయి గుంటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 గృహాలు దగ్ధమయ్యాయి. విలువైన వస్తు సామగ్రి, నగదు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు చందోలు ఏసు పాదం, కొమ్ముకూరి వరప్రసాద్, వేమూరి ఇజ్రాయేల్‌కు చెందిన గృహాలు అగ్ని ప్రమాదానికి గురవడంతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఘటనను VRO గోపికృష్ణ MRO మస్తాన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.