News December 8, 2025

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: హనుమకొండ కలెక్టర్

image

అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ పోస్టర్లను ఆవిష్కరించారు. అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడు, ఉద్యోగి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. లంచం డిమాండ్ చేస్తే ACB టోల్ ఫ్రీ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వరంగల్ ACB డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 11, 2026

జనగామ: అధికారుల తప్పిదం.. అర్హులకు అన్యాయం!

image

ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అధికారుల నిర్వాకం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇటీవల రేషన్ కార్డులు పొందిన వారు గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో రేషన్ కార్డుతో వేరొకరు లబ్ధిపొందుతున్నట్లు ఆన్లైన్లో చూపిస్తుండడంతో, అసలైన అర్హులు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి పరిధిలో ఓ మహిళ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అసలు విషయం తెలిసింది.

News January 11, 2026

మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

image

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

News January 11, 2026

కమనీయం.. కొత్తకొండ వీరభద్రుడి కల్యాణం

image

కొత్తకొండ వీరభద్ర స్వామి కల్యాణం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం అనంతరం భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.