News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్‌గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
Similar News
News January 2, 2026
శాతవాహన అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా ఎస్ రమాకాంత్

శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో డాక్టర్ ఎస్.రమాకాంత్ పీజీ & ప్రొఫెషనల్ పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమకయ్యరు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టర్ ఉత్తర్వులు అందజేశారు. రమాకాంత్ ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
News January 2, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.
News January 2, 2026
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు పతకాల పంట!

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.


