News December 8, 2025

ఎరీన స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఏఎన్‌యూ విద్యార్థుల సత్తా

image

మంగళగిరిలో నిర్మల ఫార్మసీ కళాశాల నిర్వహించిన ఎరీన 2025 స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ANU విద్యార్థులు సత్తా చాటారు. ఖోఖో ఉమెన్‌లో ప్రథమ, 100 మీటర్ల రిలే రన్నింగ్ ప్రథమ, చెస్‌లో ద్వితీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విజేతలను వర్సిటీ వీసీ గంగాధరరావు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

image

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

image

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.