News December 8, 2025
జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.
Similar News
News March 18, 2026
విశాఖ: మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్

నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్టల్ గార్డ్ కాపాడింది. విశాఖకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 300 కి.మీ.ల దూరలో బోటు మరమ్మతులకు గురైంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్‌పాండర్ సాయంతో అధికారులను కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమాచారం మేరకు కోస్ట్ గార్డులు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడారు.
News March 18, 2026
జీవీఎంసీలో కలెక్టర్ పాలన.. అధికారుల్లో గుబులు

జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కార్పొరేషన్ నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో పరిపాలన సాగనుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్చరికలు, మెమోలు ఇచ్చినా మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పాలనాపగ్గాలు చేపట్టడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇటీవల పలు జోన్లలో ఏసీబీ తనిఖీలు జరగడం గమనార్హం.
News March 18, 2026
విశాఖ: గంజాయి పట్టివేత.. కానిస్టేబుళ్ల అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఐదుగురిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో VZM జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. కారులో 10 కేజీల గంజాయి తరలిస్తుండగా భీమిలి పరిధి దాకమర్రికి సమీపంలో వీరిని అరెస్ట్ చేశామన్నారు. కానిస్టేబుళ్లు శివప్రసాద్(ఎస్. కోట), వి.రాంబాబు (వేపాడ), ఇ.సతీశ్(కొత్తవలస) స్టేషన్లకు చెందిన వారిగా మిగిలిన వారిని పి.శివకృష్ట, జి.గోపిగా గుర్తించారు.


