News December 9, 2025
సిరిసిల్ల: ‘ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందించాలి’

ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంచార్జి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గర్భిణీల ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News March 12, 2026
ఖమ్మం: పార్లమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బొగ్గు శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం పార్లమెంట్ అనెక్స్ హాలులో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బొగ్గు సంస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరాన్ని ఎంపీ రవిచంద్ర సూచిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
News March 12, 2026
వైద్యులపై ఎంజీఎం సూపరింటెండెంట్ సీరియస్

ఎంజీఎంలో వైద్యుల సమయపాలనపై సూపరింటెండెంట్ హరీష్ చంద్రా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓపీ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 9:30 గంటలైనా జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఏఎంసీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని సంబంధిత వైద్యులను హెచ్చరించారు.
News March 12, 2026
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్ హరిత

ASF జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఏఎస్పీ చిత్తరంజన్, ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పవిత్ర రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.


