News April 19, 2024
కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర: ఆప్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టులో ఆరోపించింది. ‘డయాబెటిస్తో బాధపడుతున్న ఆయనకు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెంత రిక్వెస్ట్ చేసినా అధికారులు తగినంత డోసు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించింది. ఆయనకు తగిన వైద్యం అందేలా చూడాలని కోర్టును కోరింది. కాగా.. కేజ్రీ కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 15, 2026
పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
News January 15, 2026
తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.
News January 15, 2026
‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.


