News April 19, 2024
ఖరీఫ్ నుంచి వరికి రూ.500 బోనస్ ఇస్తాం: పొన్నం ప్రభాకర్

TG: ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. ‘ఒకట్రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Similar News
News January 9, 2026
TODAY HEADLINES

✦ పొదుపు సంఘాలకు త్వరలో ఆన్‌లైన్‌లో రుణాలు: AP CM CBN
✦ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర: TG CM రేవంత్
✦ అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ఎందుకు: YS జగన్
✦ అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
✦ TG: ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు
✦ తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా ప్రీమియర్లపై గందరగోళం
✦ తిలక్ వర్మకు సర్జరీ.. NZతో తొలి 3 టీ20లకు దూరం
News January 9, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.
News January 9, 2026
TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.


