News April 19, 2024
సివిల్స్ టాపర్స్ మార్కులు వచ్చేశాయ్
సివిల్స్ టాపర్స్ మార్కులు వెల్లడయ్యాయి. టాప్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవకు 1099 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్‌కు 1067, మూడో ర్యాంకర్ అనన్య రెడ్డికి 1065, నాలుగో ర్యాంకర్ పీకే సిద్ధార్థ్‌కు 1059, ఐదో ర్యాంకర్ రుహానీకి 1049 మార్కులు వచ్చాయి. సివిల్స్ మెయిన్స్‌కు 1750, ఇంటర్వ్యూకు 275 కలిపి మొత్తం 2025 మార్కులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.
Similar News
News November 19, 2024
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అప్‌డేట్స్
☛ ఈనెల 23 నుంచి మ్యాచులు ప్రారంభం, DEC 15న ఫైనల్
☛ ముంబై కెప్టెన్‌గా శ్రేయస్. జట్టులో రహానె, పృథ్వీ షా, శార్దూల్‌కు చోటు
☛ బెంగాల్ జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ
☛ UP కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్, జట్టులో సభ్యులుగా రింకూ సింగ్, నితీశ్ రాణా, యశ్ దయాల్, మోసిన్ ఖాన్.
☛ HYD టీమ్ కెప్టెన్‌గా తిలక్ వర్మ, కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
☛ జియో సినిమా యాప్‌లో లైవ్ మ్యాచులు .
News November 19, 2024
అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
News November 19, 2024
నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.