News April 19, 2024

కరీంనగర్‌లో బండి సంజయ్ నామినేషన్

image

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ తరఫున స్థానిక బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరెట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ శంకర్ తదితరులు ఉన్నారు. కాగా కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయమని ట్విట్టర్‌లో బండి సంజయ్ పోస్ట్ చేశారు.

Similar News

News March 20, 2026

కరీంనగర్: సింధీలకు ‘ఝూలేలాల్’ స్ఫూర్తి: కేంద్ర మంత్రి

image

సింధీలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన సింధీల నూతన సంవత్సర వేడుకలు (చేటీ చంద్)లో ఆయన పాల్గొని సందడి చేశారు. విభజన కష్టాలను అధిగమించి, ఆరాధ్య దైవం ఝూలేలాల్ జీ బాటలో సింధీ సమాజం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. అద్వానీ, అదానీ వంటి ప్రముఖులు ఈ వర్గం వారేనని ఆయన గుర్తు చేశారు.

News March 20, 2026

కరీంగర్: బడ్జెట్ అంకెల గారడీ, ప్రజలకు దగా: కేంద్ర మంత్రి

image

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా వంచించిందని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలకు పాడె కట్టిన ఈ బడ్జెట్, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను విస్మరించి, మైనారిటీలకు అధిక నిధులు కేటాయించడం విడ్డూరమన్నారు.

News March 17, 2026

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.