News April 19, 2024
బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63కోట్లు
AP: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News November 19, 2024
విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
AP: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10% వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 10% వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరింది. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12కోట్లను నేడు విడుదల చేయనుంది.
News November 19, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగి తీరుతుంది: పీసీబీ
ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య? ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News November 19, 2024
తెలుగు రాష్ట్రాల్లో నేటి కార్యక్రమాలు
☛ వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభ
☛ ఖమ్మంలో బీసీ డెడికేషన్ కమిషన్ పర్యటన
☛ లగచర్ల కేసు.. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
☛ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం (1.సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు, 2.ఎక్సైజ్, 3.విదేశీ మద్యం వాణిజ్యం, 4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు)
☛ నేడు పోలీసుల కస్టడీకి బోరుగడ్డ అనిల్