News April 19, 2024
పొరపాటు చేయొద్దు.. పసుపుపతి నిద్రలేస్తాడు: జగన్

AP: చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. ‘టీడీపీకి ఓటేస్తే పసుపుపతి నిద్రలేచి వదల బొమ్మాళి వదల అంటాడు. చంద్రబాబు కత్తిరింపులు మొదలవుతాయి. గోరు ముద్ద రద్దు. విద్యా దీవెన, వసతి దీవెన అమ్మఒడి రద్దు. పేదవాడికి వైద్యం అందకుండా చేస్తుంది ఈ చంద్రముఖి. అక్కాచెల్లెమ్మలకు బతుకులు అతలాకుతలం అవుతాయి. ఫ్యాన్‌కి ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.
Similar News
News November 7, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.
News November 7, 2025
భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.
News November 7, 2025
ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.


