News December 9, 2025
ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
Similar News
News December 13, 2025
కర్నూలు: ఆటో కొనివ్వలేదని సూసైడ్

నంద్యాల(D) బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన.. కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదైంది.
News December 13, 2025
ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయి: టీజీ వెంకటేశ్

నేడు ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని అటల్-మోదీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే మనకు బీజేపీ సహకారం ఎలా ఉందో కర్నూలు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మంత్రి టీజీ భరత్ కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.
News December 13, 2025
కర్నూలు జిల్లాలో 8,781 కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు.


