News April 19, 2024

ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు.

Similar News

News October 9, 2025

హోమ్ స్టే విధానంపై పర్యాటక శాఖ వర్క్‌షాప్

image

విశాఖలో హోమ్ స్టే, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ విధానాలపై అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు VMRDA చిల్డ్రన్ ఎరీనాలో పర్యాటక శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సొంత ఇళ్లలో కొంత భాగాన్ని పర్యాటకులకు వసతిగా కల్పించి, ఆదాయం పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశమని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. ఆసక్తిగల పౌరులు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.

News October 8, 2025

కేజీహెచ్‌లో 46 మంది విద్యార్థులకు చికిత్స

image

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల సంఖ్య 46కి తగ్గింది. మొత్తం 64 మంది ఆస్పత్రిలో చేరగా.. వీరిలో మంగళవారం 8 మందిని డిశ్చార్జ్ చేసి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. ప్రస్తుతం 46 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు.

News October 8, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.