News December 9, 2025
మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Similar News
News January 21, 2026
ఖానాపూర్‌లో రూ.13కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
News January 21, 2026
FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.
News January 21, 2026
చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.


