News December 9, 2025
ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.
Similar News
News January 13, 2026
త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్‌లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.
News January 13, 2026
కోడిపందేలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్!

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో కోడిపందేల నియంత్రణకు కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు 0884-2356801 నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పందేలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News January 13, 2026
తిరుమలలో ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస తిరుప్పావై పాశురాల పారాయణం బుధవారంతో ముగియనుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన, శ్రీవల్లి పుత్తూరు చిలుకలు అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు.


