News December 9, 2025
సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 13, 2026
ఓటర్ల జాబితా విడుదల.. నల్గొండే టాప్

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా విడుదలైంది. నల్గొండలోని 7 మున్సిపాలిటీల్లో అత్యధికంగా 3,09,080 మంది ఓటర్లు ఉన్నారు. సూర్యాపేటలోని 5 పురపాలికల్లో 2,28,646 మంది, యాదాద్రి భువనగిరిలోని 6 మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. అత్యధిక ఓటర్లతో నల్గొండ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచింది.
News January 13, 2026
రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News January 13, 2026
మేడారం: జంపన్నవాగు జంట బ్రిడ్జిల హిస్టరీ తెలుసా..?

మేడారం జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం సాధారణంగా జరగలేదు. 2002లో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. వ్యతిరేకించిన నక్సలైట్లు పేల్చివేయాలని యత్నిస్తే మహిళలు రక్షక దళంగా ఏర్పడి అడ్డుకున్నారు. దీంతో అన్నలు వెనక్కి తగ్గగా కేవలం 37 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. 2018లో రెండో బ్రిడ్జిని నిర్మించారు. ఇది కూడా 38 రోజుల్లోనే పూర్తయ్యింది.


