News December 9, 2025
పాలమూరు: ఓటు వేయాలంటే 10 కి.మీ నడవాల్సిందే..!

నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తీవ్రంగా కష్టపడుతున్నారు. వరహాబాద్, మల్లాపూర్ చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాలి. గిసుగండి ఓటర్లు మద్దిమడుగు రావడానికి కూడా 10 కిలోమీటర్లు నడక తప్పడం లేదు.
Similar News
News January 14, 2026
MBNR: ఆర్టీసీ బస్సు ప్రమాదం.. డ్రైవర్ వివరణ

జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద జరిగిన ఆర్టీసీ <<18851918>>బస్సు ప్రమాదానికి<<>> గల కారణాలను ఆర్టీసీ డ్రైవర్ కార్తీక్ వెల్లడించారు. HYD నుంచి కర్నూలుకు వెళ్తుండగా రాత్రి 1 గంటకు డీసీఎం వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలోని బస్సులో ఉన్న 25 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 14, 2026
సత్తుపల్లి ‘జిల్లా’.. అభివృద్ధి మంత్రమా? ఎన్నికల తంత్రామా?

దశాబ్దాల కాలంగా నానుతున్న ‘సత్తుపల్లి జిల్లా’ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఖమ్మం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్నది ప్రజల ఆకాంక్ష. అయితే, మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నినాదం వెనుక రాజకీయ వ్యూహముందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఓట్ల కోసమే వేసిన ఎత్తుగడనా లేక నిజమైన అభివృద్ధి ప్రణాళికా? అన్నది ప్రభుత్వం ఇచ్చే స్పష్టతపైనే ఆధారపడి ఉంది.
News January 14, 2026
సత్తుపల్లి: ఆదర్శం.. కండక్టర్ నుంచి డీఎం స్థాయికి..!

పట్టుదలే ఆయుధంగా ఆర్టీసీ కండక్టర్ నుంచి సత్తుపల్లి RTC డీఎం స్థాయికి ఎదిగి లక్ష్మీనారాయణ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ 3 సార్లు ఎండీ నుంచి అవార్డులు అందుకోవడం విశేషం. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని నిరూపించిన ఆయనను ‘ట్రస్మా’ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దని ఆయన ప్రస్థానం నిరూపిస్తోందని పలువురు ప్రశంసించారు.


