News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News March 4, 2026
BRIC-THSTIలో ఉద్యోగాలు

<
News March 4, 2026
బిహార్ సీఎంగా బీజేపీ నేత?

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.
News March 4, 2026
అరుదైన రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా

రేపు T20 WCలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్‌గా 500 వికెట్ల క్లబ్‌లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్‌గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.


