News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్‌లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
Similar News
News March 26, 2026
నెల్లూరు: బస్సు ప్రమాదంలో తల్లీ కుమార్తె దుర్మరణం

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన తల్లీ, కుమార్తె మృతి చెందారు. తూర్పుయర్రబల్లికి చెందిన నర్సింగు శ్రీను, అతని భార్య ప్రభావతి, కుమార్తె చైత్ర బేల్దారీ పనులు చేసుకుంటూ జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి తన కుమార్తె చైత్రతో కలిసి పొదిలి మండలం ఉన్నగురవాయపాలెంలోని పుట్టింటికి వస్తుండగా బస్సు ప్రమాదంలో చిక్కుకుని ఇద్దరూ మృతి చెందారు.
News March 26, 2026
నెల్లూరు జిల్లాకు 9 పశు ఔషధీ విక్రయ కేంద్రాలు మంజూరు

జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరు వారి చాంబర్‌లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 26, 2026
నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.


