News April 19, 2024
వాట్సాప్‌లో ‘ఈవెంట్స్’ ఫీచర్

వాట్సాప్‌లో ‘ఈవెంట్స్’ పేరుతో మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా కమ్యూనిటీ గ్రూపుల్లోని సభ్యులు ఈవెంట్ క్రియేట్ చేసి ఇతర సభ్యులను ఆహ్వానించవచ్చు. ఆ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేసిన వారికి WhatsApp కాల్స్ ద్వారా సమాచారాన్ని ఇవ్వొచ్చు. ఈవెంట్ క్రియేట్ చేసేటప్పుడు తేదీ, లొకేషన్ వంటి ఇన్ఫో ఎంటర్ చేసుకునే వీలుంటుంది. ఈవెంట్ వివరాల్లో ఏవైనా మార్పులు చేస్తే సభ్యులందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది.
Similar News
News September 18, 2025
మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.