News December 9, 2025
తిరుపతిలో విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

తిరుపతిలో ఓ కళాశాల విద్యార్థిని(మైనర్ బాలిక)పై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. హాస్టల్ మారే క్రమంలో పరిచయమైన డ్రైవర్ డబ్బు సాయం చేస్తానని నమ్మబలికి బాలికను గదికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా, బాధితురాలు తన ఫ్రెండ్‌తో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
Similar News
News January 8, 2026
పెనమలూరులో గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెనమలూరు-వణుకూరు రోడ్డులో ఎస్‌ఐ ఫిరోజ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని విచారించగా, వారి వద్ద నుంచి 2 కేజీల పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరుకి చెందిన ప్రదీప్ కుమార్, అజయ్ బాబులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
News January 8, 2026
చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.
News January 8, 2026
మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.


