News December 9, 2025
KNR: కట్టింది రెండు గోడలే.. రూ.కోట్లు కొట్టేశారు..!

మానేరు రివర్ ఫ్రంట్‌లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పనులు అవ్వకుండానే కాంట్రాక్టర్‌కు రూ.192CR బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలొస్తున్నాయి. BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.545 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు మానేరుకు ఇరువైపులా కేవలం 2 రిటైనింగ్ వాల్స్ మాత్రమే కట్టారు.
Similar News
News March 4, 2026
టాప్ సెల్లింగ్ కార్‌గా డిజైర్!

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్‌లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
News March 4, 2026
హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


