News December 9, 2025
కడప SPని ఆశ్రయించిన ప్రేమ జంట.!

తమను చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఓ ప్రేమజంట కడప SPని కలిసింది. వేల్పులకి చెందిన సుష్మాన్ బేగం, కొండూరుకి చెందిన మనోహర్ ప్రేమించుకున్నారు. అనంతరం చీమలపెంట వద్ద ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయించగా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో వారి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదని, తమకు ప్రాణహాని ఉందని SPని ఆశ్రయించారు.
Similar News
News January 14, 2026
చందుర్తి: GREAT.. జాతీయ స్థాయికి ఎంపిక: కలెక్టర్ ప్రశంస

సైన్స్ ప్రాజెక్ట్‌ను రూపొందించి జాతీయ స్థాయికి ఎంపికైన మల్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జాహ్నవిని కలెక్టర్ గరీమా అగర్వాల్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కలెక్టర్ అభినందించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2026
T20 వరల్డ్ కప్: USA ప్లేయర్ల వీసాపై ఉత్కంఠ

T20 వరల్డ్ కప్‌కు ముందు USA క్రికెట్ జట్టుకు అనూహ్య సమస్య ఎదురైంది. పాకిస్థాన్ సంతతికి చెందిన అలీఖాన్, షయాన్ జహంగీర్, మొహమ్మద్ మొహ్సిన్, ఎహ్సాన్ ఆదిల్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో వీసా ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ విదేశాంగ శాఖ నుంచి తుది అనుమతులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే ఇది సాధారణ ప్రక్రియేనని ICC వర్గాలు స్పష్టం చేశాయి.
News January 14, 2026
మెదక్: జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ విట్టల్, సెక్రటరీ నాగభూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ట్రెజరర్ ఎల్లయ్య ఉన్నారు.


