News December 9, 2025

HYD: ప్చ్.. ఈ సమ్మర్‌లో బీచ్‌ కష్టమే!

image

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్‌గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్‌ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్‌మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.

Similar News

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం, మంగళవార లలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.

News April 6, 2026

అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

image

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.

News April 6, 2026

నల్గొండ: దగ్ధమైన నాలుగు ఎకరాల తోట..!

image

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో నాలుగెకరాల నీలగిరి తోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. కోతకు సిద్ధంగా ఉన్న తోట కళ్లముందే బుగ్గిపాలు కావడంతో రైతులు రంగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. ఓ వ్యక్తి చేసిన పని వల్లే ఈ అనర్థం జరిగిందని, సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.