News December 9, 2025

VZM: ‘DCCB ద్వారా రైతులకు రూ.100 కోట్ల రుణాలు’

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైతులకు ఆప్కాబ్ సహకారంతో రూ.100 కోట్ల పంట రుణాలు మంజూరు చేయనున్నట్లు DCCB ఛైర్మన్ నాగార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరా పంటకు వరికి రూ.49వేలు, మొక్కజొన్నకి రూ.46వేలు, చెరకుకి రూ.80 వేలు, అరిటికి రూ.75 వేలు మంజూరు చేస్తామన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు,3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు,1B, ఆడంగల్ జతచేసి పంటల సీజన్‌లో DCCB బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 14, 2026

వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

image

AP: రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’ సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్‌కు అదనంగా సెస్ చెల్లించాలి. ఈ నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపునకు వినియోగించనున్నారు.

News January 14, 2026

భద్రాద్రి జిల్లాలో 1,85,348 మంది ఓటర్లు

image

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లు ఉండగా, అత్యంత తక్కువగా అశ్వారావుపేటలో 16,850 మంది ఉన్నారు. ఇల్లందులో 33,723 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.

News January 14, 2026

WGL: గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పార్టీలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీలు సైతం పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.