News December 9, 2025
కృష్ణా: అనధికార కట్టడాలు బోలెడు.. ఐనా రూపాయి కట్టరు.. ఎందుకంటే..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనధికార కట్టడాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారికి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తుండటంతో కేవలం 10% మంది కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం.
Similar News
News April 18, 2026
శాతవాహన వర్సిటీ పరిధిలో నేటి నుంచి తనిఖీలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో శనివారం నుంచి వార్షిక తనిఖీలు ప్రారంభం కానున్నాయి. అఫిలియేషన్ గుర్తింపు నవీకరణలో భాగంగా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఆయా కళాశాలలను సందర్శించనున్నాయి. ముఖ్యంగా కళాశాలల్లో కనీస వసతులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, మైదానం, మరుగుదొడ్లు మరియు అకడమిక్ ప్రమాణాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.
News April 18, 2026
HNK: ఎండల ప్రభావం.. పెరిగిన విద్యుత్ వినియోగం

మండుతున్న ఎండలు, వడగాలులతో HNK టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమవడంతో డిమాండ్ పెరిగి ఈ నెల 11న 5,195 మెగావాట్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే మిలియన్ యూనిట్ల వినియోగం కూడా భారీగా పెరిగింది. వ్యవసాయ వినియోగం తగ్గినా గృహ వినియోగం పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
News April 18, 2026
VJA: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.


