News December 9, 2025
టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: రెవెన్యూ అధికారి

జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 16, 2025
ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్‌తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.
News December 16, 2025
నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.
News December 16, 2025
యాదాద్రి: ఓటుకు నోటు.. హాఫ్ మందు..!

యాదాద్రి జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో నెగ్గేందుకు అభ్యర్థులు ఓటర్లను మభ్యపెడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో రియల్టర్లు, వ్యాపారులు బరిలో ఉన్నచోట ఓటుకు రూ.1000 నుంచి రూ.2000పైనే ముట్టజూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలను మించి మద్యం ఏరులై పారుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. మందుబాబులు ఇదే అదునుగా క్వాటర్‌కు బదులు హాఫ్ బాటిల్ బ్రాండెడ్ మద్యం కావాలని డిమాండ్ చేస్తున్నారట.


