News December 9, 2025

ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.

Similar News

News December 16, 2025

వరంగల్: 3వ విడత బరిలో 1771 సర్పంచ్ అభ్యర్థులు

image

ఉమ్మడి WGLలో 530 పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. 1771 మంది బరిలో ఉండగా, 4846కు 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది బరిలో ఉన్నారు. WGLలో 305 సర్పంచ్, 1837 వార్డుఅభ్యర్థులు, HNKలో 230, వార్డులు 1424, జనగామలో 267, వార్డులు 1632, BHPLలో 296, వార్డులు 1347, ములుగులో 157 వార్డులు 863, MHBDలో 516 సర్పంచ్, వార్డులు 2869 మంది మొత్తం 1771 సర్పంచ్, 9972 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News December 16, 2025

కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం

image

AP: కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో CM CBN పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్ ఉంటుంది. 2022 NOVలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.

News December 16, 2025

ప.గో: ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

image

​ధనుర్మాసం వచ్చేసింది. మంచు తెరలు గోదారి అలలను ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. బరిలోకి కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటుంటే, అత్తారింటికి రావడానికి కొత్త అల్లుళ్లు ఎదురు చూస్తున్నారు. సిటీల్లో ఉన్నా సరే, మనసుని లాగేసే గోదారి మట్టి వాసన, అమ్మమ్మ గారి ఊరి జ్ఞాపకాలు సంక్రాంతి ప్రత్యేకత. ఇది కేవలం పండగ కాదు.. గోదారోడి గతాన్ని, వర్తమానాన్ని ముడివేసే ఒక తీయని అనుభూతి.