News December 9, 2025

ఎన్నికల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి: కలెక్టర్

image

ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల పాత్ర కీలకమని జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్‌, కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు, తహశీల్దార్లతో వారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని వారు ఆదేశించారు.

Similar News

News December 13, 2025

వనపర్తి: రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,150 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.

News December 13, 2025

యాదగిరిగుట్ట: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఒక మాసంపాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

News December 13, 2025

విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

image

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.