News December 9, 2025
32,479 సంఘాలకు రుణం ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్ల రుణాలు ఇవ్వడం ఏమిటని ఆరా తీశారు. పొదుపు మహిళలకు అధికంగా రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడపై ధ్వజమెత్తారు.
Similar News
News January 8, 2026
అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.
News January 8, 2026
గ్రేటర్ వరంగల్‌లో 13 నర్సరీల్లో మొక్కల పెంపకం

గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజలకు అవసరమైన మొక్కలు అందించడానికి అధికారులు నర్సరీలో మొక్కల పెంపకం చేస్తున్నారు. 13 నర్సరీల్లో 5 లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10కి పైగా నర్సరీలను పునరుద్ధరించి మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో పర్యావరణానికి సంబంధించి, పూలు పండ్లకు సంబంధించిన మొక్కలను ఎక్కువగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
News January 8, 2026
హైదరాబాద్‌లో AQ 198కి చేరుకుంది

HYDలో ఎయిర్ క్వాలిటీ హెచ్చు తగ్గులుగా కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్‌క్వాలిటీ గురువారం తెల్లవారుజామున మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్ వద్ద 198కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవ్వాళ భారీగా తగ్గింది.


