News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రతినిధులకు రిటర్న్ గిఫ్టులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులకు రాష్ట్ర వైభవాన్ని చాటే ప్రత్యేక సావనీర్‌లు(గిఫ్ట్స్) అందించారు. వీటిలో సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ చీర, ముత్యాల నగరానికి ప్రతీకగా ముత్యాల చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ కళాకారులు చేతితో చేసిన లక్క గాజులు, సుగంధ సంప్రదాయాన్ని తెలిపే హైదరాబాద్ అత్తర్, రాష్ట్ర వారసత్వ సంస్కృతిని తెలిపే చేర్యాల పెయింటింగ్ చెక్క బొమ్మలు ఉంచారు.
Similar News
News March 15, 2026
జనగణన వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్

తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలిదశ జనగణన జరగనుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని, వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తాయని, ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తిగా సహకరించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. రెండో దశ సెన్సస్ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.
News March 15, 2026
హార్ముజ్‌కు యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను హార్ముజ్‌కు పంపాలని తాజాగా కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, UK తదితర దేశాలు ప్రభావితమయ్యాయని, అవి తమ వార్‌షిప్స్‌ను పంపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా వందలాది సరకు రవాణా నౌకలు హార్ముజ్‌లో నిలిచిపోవడంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది.
News March 14, 2026
ఖమేనీ అందుకే బంకర్‌లోకి వెళ్లలేదు: ఇరాన్ ప్రతినిధి

దేశ ప్రజలను ఆపదలో వదిలేసి తాను సేఫ్ బంకర్‌లోకి వెళ్లడానికి ఖమేనీ ఇష్టపడలేదని భారత్‌లో సుప్రీం లీడర్ ప్రతినిధి హకీమ్ India Today కాంక్లేవ్‌లో తెలిపారు. ఇరాన్‌లోని 9Cr మందికి సేఫ్ షెల్టర్ ఏర్పాటు చేసినప్పుడే తానూ బంకర్ హౌస్‌లోకి మారతానన్నారని చెప్పారు. నివాసాన్ని బంకర్ బేస్‌మెంట్‌తో పటిష్ఠంగా మార్చడానికీ అంగీకరించలేదన్నారు. కాగా US-ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో ఖమేనీ సహా పలువురు కుటుంబీకులు మరణించారు.


