News December 9, 2025

పార్వతీపురం: జేసీ నాయకత్వంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం

image

రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు శత శాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇది రెవెన్యూ క్లినిక్ అతిపెద్ద విజయమని, ఎవరికైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 14, 2026

‘అక్కడ మహిళల్ని..’ DMK MP వివాదాస్పద వ్యాఖ్యలు

image

DMK MP దయానిధి మారన్ ఉత్తరాది మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. TNలో మహిళలను చదువుకోమని ప్రోత్సహిస్తుంటే.. ఉత్తరాదిలో మాత్రం వారిని ‘వంటగదికే పరిమితం చేస్తూ, పిల్లల్ని కనమని’ చెబుతున్నారని విమర్శించారు. ద్రవిడ మోడల్ వల్లే TN అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా మండిపడింది. మారన్ ఉత్తరాది వారిని అవమానిస్తున్నారని.. ఆయనకు కనీస జ్ఞానం లేదని ధ్వజమెత్తింది.

News January 14, 2026

కాకినాడ: విషాద ‘భోగి’.. అగ్ని ప్రమాదంతో అగమ్యగోచరం..

image

రౌతులపూడి(M) సార్లంకపల్లెలో సంక్రాంతి సంబరాలు విషాదంలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన <<18839258>>అగ్నిప్రమాదం<<>>లో ఇళ్లను కోల్పోయిన గిరిజన కుటుంబాలు, భోగి రోజున నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా, సర్వం కోల్పోయిన బాధలో మహిళలు ఏమి తోచని స్థితిలో ఉన్నారు. అందరూ సంబరాల్లో మునిగిపోగా, ఈ పల్లెలో మాత్రం బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి.

News January 14, 2026

త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.