News December 9, 2025

ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

image

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 12, 2026

ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

image

ఏపీలో 14మంది IASలను బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా JCగా కల్పనకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి JC, తుడా వైస్ ఛైర్మన్‌గా గోవిందరావు, కడప JCగా నిధి మీన, అనంతపురం JCగా విష్ణుచరణ్, అనకాపల్లి JCగా సూర్యతేజ, చిత్తూరు JCగా ఆదర్శ్ రాజేంద్రన్.

News January 12, 2026

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

image

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదర్శ రాజేంద్రన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా నూతన జేసీగా 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివ నారాయణ శర్మను నియమించింది. నూతన జేసీ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 12, 2026

అనంతపురం జిల్లా JC బదిలీ

image

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.