News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
Similar News
News January 9, 2026
సంక్రాంతికి ఫ్రీ టోల్ లేనట్లే!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.
News January 9, 2026
విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.


