News December 9, 2025

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా రామారావు

image

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.వి.జి. రామారావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పల్నాడు జిల్లా డీఈఓగా పనిచేస్తున్న చంద్రకళను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేశారు.

Similar News

News April 9, 2026

విజయవాడలో ‘ఉగ్ర’ నిందితులకు వైద్య పరిక్షలు

image

ఉగ్రవాద అనుబంధ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఆరుగురు నిందితులకు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీకి తీసుకున్న అనంతరం నిందితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కస్టడీ సమయంలో నిందితుల భద్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

News April 9, 2026

రోహిత్ శర్మ బయోపిక్?

image

రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీ కొత్త చర్చకు దారితీసింది. నెట్‌ఫ్లిక్స్, MI లోగోలతో ఉన్న కాపీని ఆయన పోస్ట్ చేశారు. అందులో టైటిల్ నేమ్ దగ్గర ముందు పదాన్ని కొట్టివేయగా, లాస్ట్‌లో ఛాంపియన్ అని కనిపిస్తోంది. అలాగే జెర్సీ నంబర్ 45, ఆయన పేరు, ఇవాళ్టి డేట్ ప్రింట్ చేసి ఉన్నాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ రోహిత్ బయోపిక్‌/డాక్యుమెంటరీ తీస్తోందా లేక ఏదైనా షోలో ఆయన పాల్గొంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

News April 9, 2026

సంగారెడ్డి: ‘ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

image

ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.