News December 9, 2025

లారీల ‘బంద్’ తాత్కాలిక వాయిదా

image

AP: ఇవాళ అర్ధరాత్రి నుంచి <<18509425>>బంద్<<>> చేపట్టాలన్న నిర్ణయంపై లారీ ఓనర్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గింది. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో సమ్మె వాయిదా పడింది. 4 రోజుల్లో ఫిట్‌నెస్ ఛార్జీలు రివైజ్ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 13-20 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.

News January 14, 2026

పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

image

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్‌ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.

News January 14, 2026

సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

image

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.