News December 9, 2025

TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

image

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.

Similar News

News January 6, 2026

వెనిజులా తర్వాత.. ఈ దేశాలే ట్రంప్ టార్గెట్?

image

వెనిజులాపై <<18751661>>దాడి<<>> చేసి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆయన గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. <<18742175>>అటాక్‌కు సిద్ధమని<<>> ఇటీవల హెచ్చరించారు. గ్రీన్లాండ్‌లోని ఐస్‌ల్యాండ్‌పై కన్నేశారు. క్యూబా దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలింది. కొలంబియా, మెక్సికో డ్రగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.

News January 6, 2026

VIRAL: ఈ పెద్ద కళ్ల మహిళ ఎవరు?

image

కర్ణాటకలో ఎక్కడ చూసినా ఓ మహిళ ఫొటో కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులు, పొలాలు, దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె చిత్రాన్ని దిష్టి బొమ్మగా పెడుతున్నారు. దీంతో పెద్ద కళ్లతో, సీరియస్‌గా చూస్తున్న ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘ఆమె పేరు నిహారికా రావు. కర్ణాటకకు చెందిన యూట్యూబర్. 2023లో ఓ వీడియో క్లిప్‌ నుంచి తీసుకున్నదే ఆ లుక్’ అని కొందరు యూజర్లు పేర్కొంటున్నారు.

News January 6, 2026

ప్రముఖ నటుడు కన్నుమూత

image

టాలీవుడ్ నటుడు సురేశ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. 3 దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పని చేసిన ఆయన.. మల్టీనేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవుల్లో పని చేశారు. నటనపై ఆసక్తితో చిత్ర రంగంలోకి ప్రవేశించిన సురేశ్ కుమార్.. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో నటించి మెప్పించారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహా నటి, గోల్కొండ హైస్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి పలు సినిమాల్లో నటించారు.